Varanasi: రెండు షాట్ల కోసం ఆరు నెలలు.. మహేష్ ని మార్చేసిన జక్కన్న!
on Feb 4, 2026

'వారణాసి'ని గొప్పగా చెక్కే పనిలో జక్కన్న
రెండు షాట్ల కోసం ఆరు నెలలు ట్రైనింగ్
మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ చేంజ్
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి జక్కన్న అనే పేరుంది. సినిమాలో ప్రతి షాట్ ని తాను అనుకున్న విధంగా వచ్చేవరకు చెక్కుతూనే ఉంటారు. అందుకే రాజమౌళికి ఆ పేరు పడిపోయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం 'వారణాసి'(Varanasi) కోసం అంతకుమించి చెక్కుతున్నారు. కేవలం రెండు షాట్ల కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ని ఏకంగా ఆరు నెలలు కష్టపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు రివీల్ చేయడం విశేషం.
'వారణాసి' మూవీ టీమ్ రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రతి చిన్న విషయంపై రాజమౌళి ఎంత కేర్ తీసుకుంటారో మహేష్ వివరించారు. "రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని క్షుణంగా పరిశీలిస్తారు. ఈ సినిమా కోసం ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఎన్నిసార్లయినా రిహార్సల్స్ చేస్తారు. ముఖ్యంగా నేను ఇందులో పోషించిన రాముడి పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాం. దానికోసం 2-3 నెలలు కష్టపడ్డాం. వారణాసి కోసం నేను పరిగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చారు. దానికోసం ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. రెండు షాట్ల కోసం ఇదంతా చేశాం. సినిమాపై రాజమౌళి ఎంత శ్రద్ధ చూపుతారో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు." అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇతర హీరోల అభిమానులు కూడా మహేష్ రన్నింగ్ గురించి మాట్లాడుతుంటారు. అలాంటిది ఇప్పుడు మహేష్ రన్నింగ్ స్టైల్ ని రాజమౌళి మార్చేయడంతో.. కొత్త రన్నింగ్ స్టైల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
Also Read: షాకింగ్.. జబర్దస్త్ కమెడియన్ మృతి.. యాంకర్ సుమ కన్నీటి పర్యంతం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



