ENGLISH | TELUGU  
Home  » TV News

షాకింగ్.. జబర్దస్త్ కమెడియన్ మృతి.. యాంకర్ సుమ కన్నీటి పర్యంతం!

on Feb 4, 2026

 

ప్రముఖ జబర్దస్త్ నటుడు కన్నుమూత
టీవీ పరిశ్రమలో విషాద ఛాయలు
స్టార్ యాంకర్ సుమ కన్నీటి పర్యంతం

 

తెలుగు బుల్లితెరపై 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'సుమ అడ్డా' వంటి షోల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ కన్నుమూశారు. ఆయన సోమవారం మృతి చెందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

సోమవారం రాత్రి రాజమండ్రిలోని 'రోడ్డు కం రైల్వే బ్రిడ్జి'పై జరిగిన ప్రమాదంలో బాబీ మృతిచెందారు. బాబీ బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. అతివేగంగా రెండు బైక్‌లు ఢీకొనడం, హెల్మెట్లు ధరించకపోవడంతో.. ఈ ప్రమాదంలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

 

 

బాబీ మరణవార్త తెలిసి బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తనతో పాటు సుమ అడ్డా షోకి బాబీ కూడా పని చేశారు. ఆ అనుబంధంతోనే బాబీ మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళిన సుమ, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో సుమ కన్నీటి పర్యంతమయ్యారు.

 

 

మాజీ ఎంపీ హర్ష కుమార్ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన బాబీ, నటనపై ఆసక్తితో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమ అడ్డా షోలతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే కమెడియన్ గా ఎదుగుతున్న బాబీ.. 28 ఏళ్ళ వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం.. టీవీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. బుల్లితెరకు చెందిన పలువురు కమెడియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా బాబీకి నివాళులర్పిస్తున్నారు. 

 

Also Read: శ్రీరాముడిగా మహేష్ బాబు.. ఆ 25 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేరు!

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.