'కుబేర' టీజర్.. శేఖర్ కమ్ముల మామూలోడు కాదు!
on May 25, 2025
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. (Kuberaa Teaser)
మాంటేజ్ సాంగ్ తో 'కుబేర' టీజర్ ను సరికొత్తగా రూపొందించారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో ఉన్న టీజర్ లో.. మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. "నాది నాది నాదే ఈ లోకమంతా" అంటూ సాగే పాటతో సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ముఖ్యంగా ధనుష్, నాగార్జున పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాలో వీరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా ఉంటాయని టీజర్ ని బట్టి అర్థమవుతోంది.
'కుబేర'కు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శేఖర్ కమ్ముల తన సినిమాల్లో సంగీతానికి పెద్ద పీట వేస్తాడు. ఇక ఇప్పుడు మాంటేజ్ సాంగ్ తో టీజర్ ను రూపొందించడం చూస్తుంటే.. 'కుబేర' మ్యూజిక్ మరింత స్పెషల్ ఉండబోతుంది అనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
