యష్‌తో దిల్ రాజు పాన్ ఇండియా మూవీ!
on Jan 25, 2023
ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాలను మాత్రమే నమ్ముకుంటే లాభం లేదు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేస్తే వర్కౌట్ కాదు. సరైన జాక్‌పాట్ కొట్టాలంటే తగిన హీరోను తీసుకొని అందుకు తగ్గ దర్శకునితో పాన్ ఇండియా చిత్రం తీయాలి. అది అదృష్టం ఉండి పాన్ వరల్డ్ రేంజ్ కి వర్క్ అవుట్ అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం దిల్ రాజు మనసులో ఇదే ఉంది. ఆయన ఇంతకాలం తెలుగు స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఇతర భాషల లోకల్ నిర్మాతలతో టచ్ లో ఉంటూ పర భాష ప్రొడ్యూసర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ వారి సపోర్టును తీసుకుంటున్నారు. అలా ఆయన ఇప్పటికే కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తో వారసుడును వర్కౌట్ చేశారు. ఆ వెంటనే కోలీవుడ్ యంగ్ స్టార్ శివ కార్తికేయన్, ధనుష్ లపై కూడా ఆయన దృష్టి సారించారు.
తాజాగా కన్నడ ఇండస్ట్రీలో పలువురి పై ఆయన చూపు నిలిచింది. అక్కడి స్థానిక నిర్మాతలతో కలిసి ప్రస్తుతం కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న పాన్ ఇండియా స్టార్ యష్ అలియాస్ రాఖీ బాయ్ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం. ఆయనతో కలిసి ఓ బిగ్ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా తీయాలి అనేది ఆయన ప్రయత్నం. దిల్ రాజు అంటే యష్ ప్రత్యేకమైన గౌరవం ఉంది. తెలుగులో అతను తనకు మంచి సపోర్ట్ గా ఉంటాడనే భావన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో దిల్ రాజు మంచి స్క్రిప్ట్ తీసుకొని వస్తే ఆయనకు డేట్స్ ఇచ్చేందుకు యష్ రెడీగా ఉన్నాడట. ముందుగా అయితే దిల్ రాజు ఒక స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతమైతే భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో యష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అతను ఇప్పటివరకు కేజిఎఫ్ 2 తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని కాదని ఒకే ఒక చిత్రానికి ఓకే చెప్పారు. ఇంకా కథలు వింటున్నాడే కానీ ఏది ఫైనల్ చేయడం లేదు. దాంతో దీన్ని దిల్ రాజు తనకనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే ముందుగా అడ్వాన్స్ ఇచ్చి యష్ తో ఓ కథ గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ కథ సెట్ కాకపోయినా మరో రెండు మూడు కథలు అయినా సరే సెట్ చేయించి ఆయనతో సినిమా చేయాలి అని దిల్ రాజు ఆలోచిస్తున్నాడట. మరి యష్ కోసం దిల్ రాజు ఎలాంటి దర్శకుడిని ఎంచుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.