హ్యూమన్ మిషన్ లా ఎన్టీఆర్.. అసలు టార్గెట్ ఏంటి..?
on Jun 10, 2025
'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఇదిలా ఉంటే, అసలు 'వార్-2'లో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతుందో తాజాగా రివీల్ అయింది. (War 2 Movie)
'వార్-2'లో ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం గురించి తాజాగా స్పందించిన కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ ప్రశంసలు కురిపించారు. "మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయన సెట్ లోకి వస్తే.. వెంటనే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి ప్రవహిస్తుంది. ఎన్టీఆర్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉందనిపిస్తుంది. వార్-2 చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో చాలా కోణాలు దాగి ఉంటాయి. అందుకే ఆయన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశాం. సింపుల్ గా ఉంటూనే పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. ఓ లక్ష్యంతో పని చేసే హ్యూమన్ మిషన్ లా ఆయనను చూపించే ప్రయత్నం చేశాం." అని అనైతా ష్రాఫ్ చెప్పుకొచ్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
