ఎన్టీఆర్ బర్త్ డే.. ఊహించని సర్ ప్రైజ్ రాబోతుంది!
on May 16, 2025

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. (War 2 Teaser)
వార్-2 షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ ఇంతవరకు ఈ సినిమా నుంచి ఒక్క అధికారిక పోస్టర్ కూడా రాలేదు. దీంతో వార్-2 అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న టీజర్ విడుదల కానుందని న్యూస్ వినిపించడంతో.. ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందింది. మే 20న వార్-2 నుంచి ఊహించని సర్ ప్రైజ్ రాబోతుందని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డేకి వార్-2 తో పాటు పలు అప్డేట్లు వచ్చే అవకాశముంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'డ్రాగన్' గ్లింప్స్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 'దేవర-2' అప్డేట్ రానుంది. వీటితో పాటు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా రూపొందనున్న 'మేడ్ ఇన్ ఇండియా', నెల్సన్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ లు వచ్చినా ఆశ్చర్యంలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



