ప్రముఖ హీరోయిన్ ని 15 సార్లు కొట్టిన నాగార్జున.. క్షమాపణ చెప్పాలి కదా
on Jul 30, 2025

అక్కినేని 'నాగార్జున',(Nagarjuna)'కృష్ణవంశీ'(krishna Vamsi)కాంబినేషన్ లో 'నిన్నేపెళ్లాడుతా' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తెరకెక్కిన మూవీ 'చంద్రలేఖ'(Chandralekha).రమ్యకృష్ణ, 'ఇషా కొప్పికర్'(Isha Koppikar)హీరోయిన్లు కాగా,గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగార్జునే స్వయంగా నిర్మించాడు. 1998 జులై 30 న విడుదలవ్వగా, మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.
.
రీసెంట్ గా 'ఇషా కొప్పికర్' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నా కెరీర్ లోనే 'చంద్రలేఖ' రెండో మూవీ. నాగార్జున గారు నన్ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఉంటుంది. ఆయన చెంప దెబ్బకొట్టగానే నాకు కోపం రావాలి. సీన్ బాగా రావడం కోసం నిజంగానే కొట్టమని చెప్పాను. కానీ ఆయన నన్ను నిదానంగా కొట్టాడు. నాకు కోపం రాకపోయే సరికి సీన్ బాగా రాలేదు. మీరు గట్టిగానే కొట్టండని మరో సారి చెప్పాను. ఈ విధంగా నాగార్జున గారు 15 టేక్ లు తీసుకున్నారు. దీంతో 14 ,15 సార్లు నా చెంప పై కొట్టడం జరిగింది. సన్నివేశం అయ్యాక చూస్తే నా ముఖం మొత్తం కందిపోవడంతో పాటు చెంపపై వాతలు పడ్డాయి. దీంతో నేను వద్దన్నా సరే నాగార్జున గారు బాధపడి క్షమాపణలు చెప్పారని, ఇషా చంద్రలేఖ షూటింగ్ నాటి విషయాలని పంచుకుంది.
పలు వెబ్ సిరీస్ లో కూడా నటించిన ఇషా తమిళంలో 'కాదల్ కవితై' అనే మూవీకి గాను 'బెస్ట్ ఫిమేల్ డెబ్యూ' కింద ఫిలిం ఫేర్ అవార్డుని అందుకుంది. హిందీ తో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో సుమారు 40 చిత్రాల వరకు చేసిన ఇషా, జెడి చక్రవర్తి, వినీత్ హీరోలుగా వచ్చిన 'వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



