పృథ్వీ రాజ్ సుకుమారన్ భార్యకి వేధింపులు.. ఏడేళ్లుగా ఎందుకు చెప్పలేదు!
on Jul 30, 2025

'సలార్'(Salaar)లో తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులని అలరించిన మలయాళ హీరో 'పృథ్వీ రాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran). ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు.
రీసెంట్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ భార్య 'సుప్రియ మేనన్'(Supriya Menon)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఏడు సంవత్సరాల నుంచి 'ఆన్ లైన్' వేదికగా ఒక మహిళ నన్ను అసభ్యకరమైన కామెంట్స్ తో వేధిస్తుంది. ఆ మహిళ ఎవరో కూడా నాకు తెలుసు. ఎన్నో సార్లు ఆమె ఖాతాని బ్లాక్ చేశాను. అయినా సరే ఫేక్ ఖాతాలు సృష్టించుకొని కామెంట్స్ చేస్తుంది. ఆమె ఫేక్ ఖాతాలని బ్లాక్ చేయడం నా జీవితంలో భాగమైపోయింది. ఆమెకి ఒక చిన్న పిల్లోడు ఉన్న కారణంగా ఇన్ని రోజులు చర్యలు తీసుకోలేదు. చనిపోయిన నా తండ్రిపై కూడా నిందలు వేస్తుందంటూ సుప్రియ తన ఆవేదనని వెల్లడి చేసింది.
'బిబిసి'(BBC)ఛానల్ లో రిపోర్టర్ గా పని చేసిన సుప్రియకి 'పృథ్వీరాజ్ సుకుమారన్' తో 2011 లో వివాహం జరుగగా,వీరువురికీ ఒక కూతురు ఉంది. సుప్రియ ప్రస్తుతం పృథ్వీరాజ్ ప్రొడక్షన్ పై నిర్మాణం జరుపుకునే సినిమాలకి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



