స్పిరిట్ నుంచి దీపికా అవుట్.. అసలేం జరిగింది..?
on May 22, 2025

కేవలం ప్రకటనతోనే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడేలా చేసిన చిత్రం 'స్పిరిట్' (Spirit). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నాడు సందీప్. హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ను ఎంపిక చేశాడు. అయితే ఇప్పుడామె స్పిరిట్ లో భాగం కావట్లేదని తెలుస్తోంది. (Deepika Padukone)
సినిమా విషయంలో సందీప్ రెడ్డి నిర్మొహమాటంగా ఉంటాడు. సినిమాకి నష్టం జరుగుతుంది అనుకుంటే.. ఎలాంటి వారినైనా పక్కన పెట్టడానికి వెనుకాడడు. ఇప్పుడు దీపిక విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు. దీపిక సీనియర్ హీరోయిన్, పైగా ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. అందుకేనేమో ఆమె డిమాండ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయట. రోజుకి 6 గంటలే వర్క్ చేస్తాను, తెలుగులో డైలాగ్స్ చెప్పను, ప్రాఫిట్స్ లో షేర్ కావాలి.. ఇలా పలు కండిషన్స్ పెట్టిందట దీపిక. దీంతో ఆమెను పక్కన పెట్టేయాలని సందీప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
స్పిరిట్ కోసం దీపిక స్థానంలో మరో హీరోయిన్ ని వెతికే పనిలో సందీప్ రెడ్డి ఉన్నాడట. కియారా అద్వానీ, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



