ENGLISH | TELUGU  

తల్లిపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. నిండు నూరేళ్లు బాగుండాలని ఫ్యాన్స్ రిప్లై  

on Jan 29, 2026

 

 

  
తల్లి గొప్ప తనాన్ని చెప్పిన చిరంజీవి 
ట్వీట్ లో ఏముంది 
ఫ్యాన్స్ ఏమంటున్నారు

 

చిరంజీవి(Chiranjeevi),పవన్ కళ్యాణ్(Pawan Kalyan),రామ్ చరణ్(Ram Charan)ని  మెగా ఫ్యాన్స్ ఎంతగా ఆరాధిస్తారో, వారందరి 'రాక' కి  కారణమైన 'అంజనాదేవి'(Anjana Devi)ని అంతే ఆరాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో తమ ముఖాల్లో సంతోషం ఉండటానికి కారణమైన అంజనాదేవి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కూడా అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఈ రోజు అలాంటి మాటలే సోషల్ మీడియా వేదికగా కొంచం ఎక్కువగా  వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఈ రోజు డిసెంబర్ 29  అంజనాదేవి పుట్టినరోజు.ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్ కూడా అభిమానులని అలరిస్తుంది. 

 

చిరంజీవి తన ట్వీట్ లో 'అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం. పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ విషెస్ చెప్పాడు. నీ ఆశీర్వాదమే నా బలం అనే వర్డ్ తో బిడ్డల ఎదుగుదలకి తల్లి ఆశీర్వాదం ఎంత బలమో చెప్పినట్లయింది. తన తల్లికి సంబంధించి పవన్ తో పాటు మిగతా కుటుంబసభ్యులందరు కలిసి ఉన్న ఒక వీడియోని కూడా షేర్ చేసాడు. సదరు వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.


Also read:  డబ్బు పోగొట్టుకున్న విజయ్ సేతుపతి.. వాళ్ళు బాగుంటే చాలు 

 

మెగాస్టార్ ప్రస్తుతం మన శంకర వరప్రసాద్(Mana Shankara Varaprasad Garu)విజయం ఇచ్చిన జోష్ లో ఉన్నాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఇప్పటి వరకు దర్జాగా ఎంజాయ్ చేసిన రికార్డులు ఎటువంటి ఇగోస్ కి పోకుండా మన శంకర వరప్రసాద్ కి దారి ఇస్తున్నాయి. ఓ జి హిట్ మోడ్ లో ఉన్న పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పక్కనే పెట్టుకొని సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే 'పెద్ది'(Peddi)ని శరవేగంగా ముస్తాబు చేస్తు ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీగా ఒక్కరే  కాదు వంద మంది వచ్చినా విజయం నా గుమ్మంలోనే ఉంటుందనే ధైర్యంతో ఉన్నాడు.మరి మన శంకర వర ప్రసాద్ విజయం సాధించాలని అంజనాదేవి కోరుకున్నట్లే, ఉస్తాద్, పెద్ది కూడా విజయం సాధించాలని అంజనాదేవి కోరుకుంటుంది.

 

   

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.