Varanasi: షాకిచ్చిన రాజమౌళి.. 'వారణాసి' రిలీజ్ ఎప్పుడంటే..?
on Jan 29, 2026

'వారణాసి' రిలీజ్ డేట్ లాక్
2027 ఉగాదికి విడుదల
వారణాసిలో వెలసిన పోస్టర్లు
దర్శకధీరుడు రాజమౌళి మూవీ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. తన నెక్స్ట్ మూవీ 'వారణాసి' గ్లింప్స్ లాంచ్ కోసం భారీ ఈవెంట్ ను నిర్వహించారు. అలాంటి రాజమౌళి, తన మూవీ రిలీజ్ డేట్ ని ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా రివీల్ చేసేస్తారా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'వారణాసి'. కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ను 2027 వేసవిలో విడుదల చేయనున్నట్లు.. గ్లింప్స్ లాంచ్ సందర్భంగా తెలిపారు. రిలీజ్ డేట్ ని మాత్రం రివీల్ చేయలేదు.
అయితే రాజమౌళి సినిమా అంటేనే భారీతనం. అందుకే ఈ సినిమా ఇంకా ఆలస్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 2027 వేసవికే 'వారణాసి'ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఉగాది కానుకగా 2027 ఏప్రిల్ 7ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
సినిమా పేరు లేకుండా '2027 ఏప్రిల్ 7న విడుదల' అంటూ వారణాసిలో పోస్టర్లు ప్రత్యమయ్యాయని, ఆ పోస్టర్లు వారణాసి సినిమాకి సంబంధించినవే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రమోషన్స్ లోనూ భారీతనం చూపించే రాజమౌళి ఇంత సింపుల్ గా రిలీజ్ డేట్ ని రివీల్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే ఏప్రిల్ అనేది మహేష్, రాజమౌళి ఇద్దరికీ సెంటిమెంటే. మహేష్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'పోకిరి', రాజమౌళి డైరెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'బాహుబలి-2' ఏప్రిల్ లోనే విడుదలయ్యాయి.
Also Read: మళ్ళీ మారిన ప్రభాస్ సినిమాల ఆర్డర్.. నెక్స్ట్ మూవీ స్పిరిట్ కాదు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



