డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్.. ఇద్దరు భామలతో రచ్చ రచ్చ..!
on Jun 18, 2025
మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్ ఎలా గుర్తుకొస్తుందో.. ఆయన కామెడీ టైమింగ్ కూడా అలాగే గుర్తుకొస్తుంది. చిరంజీవి కామిక్ టైమింగ్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. వింటేజ్ చిరుని మళ్ళీ వెండితెరపై చూడాలని, ఆయన కామెడీ ఎంజాయ్ చేయాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఈమధ్య ఒకటి అరా సినిమాల్లో మెగాస్టార్ ఫన్ పంచినప్పటికీ.. ఫ్యాన్స్ కి అది సరిపోలేదు. వారు డబుల్ డోస్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అసలుసిసలైన వింటేజ్ చిరంజీవి కామెడీ చూడాలని కోరుకుంటున్నారు. వారి కోరిక అనిల్ రావిపూడి సినిమాతో తీరబోతుంది. (Chiranjeevi)
చిరంజీవి తన 157వ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్.. 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. (Mega 157)
చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ అనే విషయం తెలిసిందే. అదే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్నారు. డ్రిల్ మాస్టర్ శివ శంకర్ వరప్రసాద్ గా సందడి చేయనున్నారు. స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ అదిరిపోతాయని, చిరు కామెడీకి థియేటర్లలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయమని అంటున్నారు.
రావిపూడి గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'లో బుల్లిరాజుగా మాస్టర్ రేవంత్ పంచిన హాస్యాన్ని అంత తేలికగా మరచిపోలేము. ఇప్పుడు మెగాస్టార్ మూవీ కోసం కూడా బుల్లిరాజుని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. చిరు-రేవంత్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం.
మెగా 157 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా.. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ముస్సోలిలో స్కూల్ నేపథ్యంలోని కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార, కేథరిన్ థ్రెసా కూడా పాల్గొంటున్నారు. ఈ స్కూల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో వస్తోందని, అవుట్ పుట్ పట్ల మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉందని వినికిడి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
