కన్నప్ప కి కొత్త కష్టాలు..మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం, డైరెక్టర్ కి కోర్టు నోటీసులు
on Jun 18, 2025
మంచు విష్ణు(Vishnu)అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'తిన్నడు' అనే నాస్తికుడు శ్రీ కాళహస్తీశ్వరుడికి పరమభక్తుడైన కన్నప్ప' గా మారడానికి గల కారణాలు ఏంటనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ పై మోహన్ బాబు, విష్ణు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో 'కన్నప్ప' పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ప్రభాస్(Prabhas)మోహన్ బాబు(Mohan Babu)మోహన్ లాల్(Mohan Lal)అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి టాప్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో చేస్తున్నారు. దీంతో 'కన్నప్ప' పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు రాబడుతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
కన్నప్పలో 'పిలక’, ‘గిలక’అనే బ్రాహ్మణ క్యారెక్టర్స్ ని ప్రముఖ కామెడీ నటులు బ్రహ్మానందం,సప్తగిరి పోషించినట్టుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళిద్దరి పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని,సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని, కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ హైకోర్టులో పిటీషన్ వెయ్యడం జరిగింది. ఈ పిటీషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్ట్ తన తీర్పులో 'కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ అధికారి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నప్ప దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్(Mukeshkumar Singh)నిర్మాతలుగా వ్యవహరించిన మోహన్‌బాబు, విష్ణు తో పాటుగా, బ్రహ్మానందం, సప్తగిరికి నోటీసులు జారీచేసింది.
అనంతరం తన తదుపరి విచారణని ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఇక కన్నప్ప మూవీ ఈ నెల 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో, విష్ణు కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. విష్ణుకి జోడిగా ప్రీతి ముకుందన్ చెయ్యగా, కాజల్ అగర్వాల్, మధుబాల, రఘుబాబు, ముకేశ్ రుషి కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార చిత్రాల్లో బిజీ గా ఉంది. స్టీఫెన్ దేవసి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు మారుమోగిపోతు ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
