
దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అందులోనూ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తొలిసారి సినిమా చేస్తుండటంతో ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగస్టుకు వాయిదా పడే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
‘వారణాసి’ సినిమా వాయిదా పడటం అనేది మహేష్ అభిమానులకు నిరాశ కలిగించే వార్తే అయినప్పటికీ.. కొత్త విడుదల తేదీ ఆగస్టు కావడం వారికి సంతోషాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు. ఒకవేళ నిజంగానే ‘వారణాసి’ ఆగస్టులో విడుదలైతే అభిమానులకు అది డబుల్ సెలబ్రేషన్ అనే చెప్పాలి. సినిమా విడుదల, బర్త్‌డే వేడుకలు ఒకే నెలలో వస్తే అభిమానులకు నెలంతా పండగే.

2027లో వారణాసి నగరాన్ని శంభవి అనే భారీ గ్రహశకలం ఢీకొట్టే ప్రమాదం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఈ విపత్తును అడ్డుకునేందుకు పురాతన కాలానికి చెందిన ఒక శక్తివంతమైన వస్తువు కోసం అన్వేషణ మొదలవుతుంది. ఈ ప్రయాణంలో హీరో ఎదుర్కొనే సవాళ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన ‘వారణాసి’.. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని డీల్.!
ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. రామాయణ ఎపిసోడ్‌లో కాసేపు శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర పోషిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు.

మైథలాజికల్, టైమ్ ట్రావెల్ అంశాలతో కూడిన ఈ గ్లోబల్ అడ్వెంచర్ ఫిలింలో విభిన్న ప్రాంతాలు, కాలాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మెరుగైన అవుట్ పుట్ కోసం రాజమౌళి మరింత సమయం తీసుకోవాలి అనుకుంటున్నారా? అందుకే ఆగస్టుకి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారా? లేక ఈ వాయిదా వార్తలు ప్రచారానికే పరిమితమవుతాయా? అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు:
50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన సినిమా.!
అసలు ఈ విడాకుల కథ ఏంటి?.. భార్యాభర్తల మధ్య గొడవేంటి.?
[Varanasi August 2027 Release, Varanasi Postponed, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra]





