క్రిస్మస్ బరిలో అఖిల్ `ఏజెంట్`!?
on Mar 3, 2022

గత ఏడాది విజయదశమికి సందడి చేసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు అక్కినేని బుల్లోడు అఖిల్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. `ఏజెంట్` అనే స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అఖిల్ కి జంటగా నూతన కథానాయిక సాక్షి వైద్య దర్శనమివ్వనుంది. ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ కథను అందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న `ఏజెంట్`ని 2022 క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం ఆ దిశగానే క్వాలిటీ వర్క్ తో షూట్ చేస్తున్నారని టాక్. కాగా, అన్నీ కుదిరి ఉంటే పోయినేడాది క్రిస్మస్ సీజన్ లోనే `ఏజెంట్` రావాల్సి ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. దాదాపు ఏడాది ఆలస్యం జరుగుతున్నట్టే. ఏదేమైనా.. త్వరలోనే `ఏజెంట్` రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. మరి.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తరువాత రాబోతున్న `ఏజెంట్`తోనూ అఖిల్ మరో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



