ఉయ్యాలవాడలో ఉపేంద్ర..?
on Jul 12, 2017

ఏ రోజుకు ఆ రోజు చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం విషయంలో కొత్త కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 150 కోట్ల ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమాను అన్ని భాషల్లో రూపొందించనున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కో భాష నుంచి ఒక్కో ప్రముఖ నటుణ్ణి కీలక పాత్ర ధారిగా తీసుకుంటున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ముందుగా కన్నడం నుంచి ‘ఉపేంద్ర’ను కథలోని కీలక పాత్రకు ఎంపిక చేశారు.
ఇక తెలుగు, తమిళం, మలయాళం, బాలీవుడ్ నుంచీ ఎవరెవర్ని తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. చిరంజీవితో కలిసి ఉపేంద్ర నటించడం ఇదే ప్రథమం. ఉపేంద్ర పాత్ర కథకు వెన్నెముక లాంటిదని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ద్వీతీయార్థంలో వచ్చే ఉయ్యాలవాడ గురువు పాత్రకు అమితాబ్ ని అడిగారని, ఆయన కూడా పాజిటీవ్ గా స్పందించినట్లు వార్తలొచ్చాయి. మరి అందులో నిజం ఎంతుందో కాలమే సమాధానం చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



