జూనియర్ ఎన్టీఆర్ జానెడే ఉంటాడు..సరిపోడు
on Jul 13, 2017

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ఎంత దూమారం రేపాయో కొత్తగా చెప్పక్కర్లేదు. మహిళలు మనశ్శాంతికి హానీకరమా కాదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వాళ్లు పక్కలోకే పనికొస్తారు అంటూ చలపతి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వయసులో ఇదేం వాగుడు అంటూ శాపనార్ధాలు పెట్టారు..అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసారి ఏకంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌ల నటన గురించి మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు అన్నగారికి చుట్టుపక్కల పదికిలోమీటర్ల వరకు ఎవరూ రారు..రాలేరు. ఇప్పుడందరూ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతున్నారు..ఆయన మంచి నటుడే..ఏ పాత్రలైనా చేయగలడు గానీ, ఒక రావణాసురుడి వేషం వేస్తే...డైలాగ్స్ ఓకే, కానీ జూనియర్ మరీ జానెడు ఉంటాడు..కానీ ఒకరి గురించి అలా తప్పుగా మాట్లాడటం తప్పని అన్నారు చలపతిరావు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



