సురభి కూడా సూపిస్తానంటుంది!
on Jul 12, 2016
పాలరాతి బొమ్మను తలపించే సుందరీమణి సురభి. ఈ తమిళ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో హల్ చల్ చేస్తోంది. సందీప్ కిషన్ సరసన "బీరువా" సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత నటించిన "ఎక్స్ ప్రెస్ రాజా"తోనే అమ్మడికి గుర్తింపు లభించింది. ఇక తాజాగా "జెంటిల్ మెన్" చిత్రంతో సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతోంది. తెలుగులో సురభికి మంచి డిమాండ్ ఉంది. అమాయకత్వానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే అమ్మాయిగారి వాలకం చూసి ఆ తరహా డీసెంట్ రోల్స్ అన్నీ సురభి చుట్టూ తిరుగుతున్నాయి.
అయితే.. కెరీర్ ప్రారంభంలో ఎక్స్ పోజింగ్ కు తావు లేకుండా నటనపై మాత్రమే దృష్టి సారించిన సురభి.. అలా ముడుచుకొని కూర్చుంటో పనవ్వదని గ్రహించి.. అందాల ప్రదర్శన మొదలెట్టింది. "జెంటిల్ మెన్"లో అమ్మడి అందాల ప్రదర్శనకు పెద్దగా ఆస్కారం లేనందువల్ల సైలెంట్ గా ఉంది కానీ.. "ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్" చిత్రాల్లో సురభి ఎక్స్ పోజింగ్ కి అందరూ "వామ్మో" అన్నారు. ఇకపై కూడా సురభి అందాల ఆరబోతను ఏమాత్రం తగ్గించాలనుకోవట్లేదు.. "సీన్ డిమాండ్ చేయాలే కానీ.." అనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతానంటుంది. అందుకే ఓ మాంచి రోమాంచిత ఫోటోషూట్ చేయించుకొని మీడియాకి వదిలింది. మరి ఈ తాజా ఫోటోలు మన దర్శకనిర్మాతలు చూసి.. సురభిలోని సెక్సీ యాంగిల్ ను ఏమైనా వినియోగించుకుంటారేమో చూడాలి!