బన్నీకి ఏమైంది...?
on Mar 17, 2017
సినీ రంగానికి విశేష సేవలందించిన వారికి ప్రతియేటా అల్లు రామలింగయ్య గారి పేరిట ఇచ్చే పురస్కారానికి ఈ ఏడాది దర్శకరత్న దాసరి నారాయణరావు ఎంపికయ్యారు. 2016వ సంవత్సరానికి గానూ ఆయన్ను ఈ అవార్డు వరించింది. సినీరంగానికి చెందిన అతిరథ మహరథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అందరి కళ్లు ఒకరి మీదే పడ్డాయి..ఆయన ఎవరో కాదు అల్లు రామలింగయ్య గారి మనవడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన బన్నీని చూసిన అక్కడి వారందరూ అవాక్కయ్యారు. కారణం ఆయన ముక్కుకి, నోటికి అడ్డంగా మాస్క్‌ని పెట్టుకొచ్చారు. అలాగే ఎప్పుడూ ఏ ఈవెంట్లో పాల్గొన్నా చలాకీగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారందరిని ఉత్సాహపరిచే బన్నీ గ్యాలరీలో దిగాలుగా కూర్చున్నాడట. దీంతో బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్‌కి ఏమైందా అని చెవులు కొరుక్కుంటున్నారు.