20 ఏళ్ల తర్వాత షాలిని రీ ఎంట్రీ!!
on Jul 22, 2021
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన షాలిని.. హీరోయిన్ గానూ పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన ఆమె కెరీర్ పీక్ లో ఉండగానే స్టార్ హీరో అజిత్ ను పెళ్లాడింది. ఆ తర్వాత షాలిని సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత షాలిని రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ప్రఖ్యాత నవల 'కల్కి' ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనేక మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో షాలిని కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. మణిరత్నం పట్టుబట్టడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవితో పాటు ఎందరో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్.. కరోనా ప్రభావం తగ్గడంతో ఇటీవల తిరిగి ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
