'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్ లో ప్రభాస్, రానా!!
on Jul 22, 2021
సినిమాను ప్రమోట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి దిట్ట. బహుబలికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఆయన.. 'ఆర్ఆర్ఆర్' ను అదే స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. అక్టోబర్ 13న ఈ సినిమాని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్ ను ఇప్పటికే స్టార్ట్ చేయాలని భావించిన రాజమౌళి.. ఇందుకోసం బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానాలను రంగంలోకి దింపాలని భావిస్తున్నారట.
ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్ కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేశారట. అయితే ఈ సాంగ్ లో ప్రభాస్, రానా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ ని ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశారని.. సాంగ్ లో ఆయన కూడా కనిపిస్తారని తెలుస్తోంది.
తారక్, చరణ్ తో పాటు మూవీలో నటించిన ముఖ్య తారాగణంతో కలిసి ప్రభాస్, రానా, అనిరుధ్ 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్ లో సందడి చేయనున్నారని సమాచారం. ఆగష్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.