రిషబ్ శెట్టి డైరెక్షన్ లో పాన్ ఇండియా హీరోల మల్టీస్టారర్..!
on Jun 19, 2025
మల్టీస్టారర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈమధ్య కాలంలో పలువురు హీరోలు మల్టీస్టారర్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఓ మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం పాన్ ఇండియా యాక్టర్ కమ్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నాడని సమాచారం.
'కార్తికేయ-2'తో నిఖిల్, 'హనుమాన్'తో తేజ సజ్జా పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' సినిమాలు చేస్తుండగా.. తేజ 'మిరాయ్'తో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే త్వరలో నిఖిల్-తేజ ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ కోసం చేతుల కలబోతున్నట్లు వినికిడి. ఈ ప్రాజెక్ట్ కి 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించనున్నాడని టాక్.
'కాంతార'తో హీరోగా, డైరెక్టర్ గా పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో 'కాంతార-2' చేస్తున్నాడు. అలాగే నటుడిగా 'జై హనుమాన్', ఛత్రపతి శివాజీ బయోపిక్ చేస్తున్నాడు. ఓ వైపు నటుడిగా భారీ సినిమాలను లైన్ లో పెడుతూనే.. ఇంకోవైపు డైరెక్టర్ గా కూడా మరో భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్, తేజ హీరోలుగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ ను పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
