మరో ట్విస్ట్.. ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్ట్ నాని చేతికి..!
on Jun 19, 2025

ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సహజం. ఇటీవల టాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. 'పెద్ది' కథను బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ, ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫిల్మ్.. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు శౌర్యువ్.. ఎన్టీఆర్ తో చేయాలనున్న కథ.. ఇప్పుడు నాని దగ్గరకు వెళ్ళినట్లు సమాచారం.
నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు శౌర్యువ్. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ ఫీల్ గుడ్ మూవీ.. 2023 డిసెంబర్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత శౌర్యువ్ ఏకంగా ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడని వార్తలొచ్చాయి. శౌర్యువ్ చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చినప్పటికీ.. ఇప్పటికే స్టార్ డైరెక్టర్స్ తో తన లైనప్ నిండిపోవడంతో.. చివరికి ఎన్టీఆర్ డ్రాప్ అయ్యాడని వినికిడి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి నాని ఎంట్రీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
'హాయ్ నాన్న' తర్వాత నాని-శౌర్యువ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుందట. ఇదొక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ దశలోనే రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించారని, ఇది రెగ్యులర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



