హవ్వ.. పవన్ గురించి మీరు మాట్లాడడమా??
on May 16, 2016

పవన్ చెప్పేదొకటి, చేసేదొకటి, నాన్ పొలిటికల్ పార్టీ స్థాపించానని చెప్పి, దానికి పొలిటికల్ టచ్ ఇచ్చారు. అందుకే ఆయనకు దూరంగా వచ్చాశా. పవన్ తో సినిమా చేయను, నాకు నచ్చని పని ఎన్నటికీ చేయను.. అంటూ పవన్ కల్యాణ్‌పై స్టేట్‌మెంట్లు ఇచ్చి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిన వ్యక్తి పీవీపీ ప్రసాద్. నిర్మాతగా, పంపిణీదారుడిగా.. పీవీపీకి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన చాలా సినిమాలకు డబ్బు కూడా సర్దుబాటు చేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేసింది పీవీపీనే. నోవాటెల్‌లో పవన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ఖర్చంతా... పీపీపీ ఎకౌంట్ లోకే వెళ్లింది. పవన్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో వెంట ఉన్న వ్యక్తి.. ఇప్పుడు సడన్ గా రివర్స్ గేర్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
అయితే వపన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఆయన సన్నిహితులు పీవీపీ మాటల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. విజయవాడ అసెంబ్లీ సీటు దక్కించుకోవాలన్న పట్టుదలతో పవన్ పక్కన పీవీపీ చేరాడని, అప్పట్లో పవన్ చేత చంద్రబాబునాయుడికి రికమెండేషన్ చేయించుకొన్నాడని, అసెంబ్లీ సీటు దక్కని పక్షంలో కనీసం రాజ్యసభకు అయినా నామినేట్ చేసేలా చూడమన్నాడని.. అది కూడా చేజారిపోవడంతో పవన్‌ని వదిలి వచ్చేశాడని, అందుకే ఇలా విమర్శలు గుప్పిస్తున్నాడని చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. ఆమధ్య పవన్ తో సినిమా చేయడానికి తెగ తిరిగిన పీవీపీ... ఆ అవకాశం కూడా లేదని తేలడంతో ఇలా ప్లేటు మార్చి, పవన్‌పై విమర్శలు చేస్తున్నాడన్నది పవన్ సన్నిహితుల వాదన. ఏదేమైనా ఓ నిర్మాత పవన్‌ని ఇలా విమర్శించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పవన్ దీనిపై స్పందిస్తాడో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



