పవన్ ఫ్యాన్సా... మజాకా..!!
on May 16, 2016

పవన్ కల్యాణ్ గురించి నేను మాట్లాడను బ్రదర్... అంటూ బన్నీ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంటూ ఇప్పుడు ట్రెండింగ్ అయి కూర్చుంది. ఫేస్ బుక్‌లో, ట్విట్టర్‌లో ఇదే మాట హల్ చల్ చేస్తోంది. ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంట్వ్యూలోనూ... బన్నీ ఇదే మాట రిపీట్ చేయడం పవన్ ఫ్యాన్స్‌కి మరింత కోపం తెప్పించింది. పవన్ గురించి ఆడియో ఫంక్షన్లో అలా అనేశారేంటి? అని అడిగితే.. ''ఇప్పుడూ అదే చెబుతా.. పవన్ గురించి మాట్లాడను బ్రదర్'' అంటూ మళ్లీ అదే ఆన్సర్ ఇచ్చాడు. దాంతో.. మరోసారి బన్నీ వైఖరి పవన్ ఫ్యాన్స్‌కి కోపం తెప్పించింది. ఫేస్ బుక్‌లలోనూ, ట్విట్టర్లలోనూ పవన్ ఫ్యాన్స్ బన్నీపై విరుచుకుపడుతున్నారు. బన్నీ పర్సనల్ పీఆర్వోలకు ఫోన్లు చేసి ''బన్నీ అలా అన్నాడేంటి బ్రదర్...'' అంటూ ఆరా తీస్తున్నారు. ''ఆ పత్రికలోనే తప్పుగా రాశారు. బన్నీ అలా అనలేదు'' అంటూ పీఆర్వోలు కవరింగ్ చేసుకొందామని చూసినా, వాళ్ల పప్పులు ఉడకడం లేదు. బన్నీ ఇప్పటి వరకూ తన తప్పు తెలుసుకోలేదు. దిద్దుబాటు చర్యలతకు పూనుకోలేదు. దాంతో పవన్‌ఫ్యాన్స్ హర్టయ్యారు. ఇప్పుడు 'నేను మాట్లాడను బ్రదర్' అనే దానికి కౌంటర్‌గా 'చూసుకొందాం బ్రదర్' అంటూ సమాధానం ఇస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ యాంటీగా మారితే ఏమవుతుందో బన్నీకి తెలుసు. అందుకే... అల్లు అరవింద్ రంగంలోకి దిగారట. ''పవన్ గురించి ఓ పాజిటీవ్ స్టేట్ మెంట్ ఇచ్చేయ్'' అంటూ బన్నీకి సముదాయించి చెప్పినట్టు తెలుస్తోంది. రేపో మాపో ఓ ప్రెస్ నోట్‌గానీ, ఓ ట్వీట్‌గానీ బన్నీ నుంచి వచ్చినా రావొచ్చు. మరి అభిమాన బ్రదర్స్ శాంతిస్తారో, లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



