బిగ్ బాస్-9 హోస్ట్ గా బాలయ్య.. దబిడి దిబిడే!
on Apr 25, 2025
బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సెప్టెంబర్ లో తొమ్మిదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే బిగ్ బాస్-8 కి అక్కినేని నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉందని న్యూస్ వినిపిస్తోంది. (Nandamuri Balakrishna)
బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఎనిమిదో సీజన్ వరకు ఆయనే హోస్ట్ చేశారు. అయితే తొమ్మిదో సీజన్ కి మాత్రం ఆయన చేయట్లేదని తెలుస్తోంది. (Bigg Boss)
గత కొన్ని సీజన్లుగా నాగార్జునే హోస్ట్ గా చేస్తుండటంతో.. ఈసారి కొత్త హోస్ట్ ని రంగంలోకి దించితే ప్రేక్షకుల్లో షో పట్ల ఆసక్తి పెరుగుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'అన్ స్టాపబుల్' షోతో ఓటీటీలో సంచలనం సృష్టించిన బాలకృష్ణను బిగ్ బాస్-9 కి హోస్ట్ గా తీసుకురావడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
బాలయ్య చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసిపోతూ.. ఎలాంటి దాపరికాలు లేకుండా మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడతారు. అందుకే ఆయన హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' అంత పెద్ద హిట్ అయింది. అలాంటి బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ చేస్తే.. షో మరో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
