నాగ్ జోడీగా వెంకీ మరదలు!
on Nov 28, 2021

2019 సంక్రాంతి సెన్సేషన్ `ఎఫ్ 2`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడీగా, విక్టరీ వెంకటేశ్ కి మరదలుగా ఎంటర్టైన్ చేసింది మెహ్రీన్. కట్ చేస్తే.. ఇప్పుడదే సినిమాకి సీక్వెల్ గా వస్తున్న `ఎఫ్ 3`లోనూ వెంకీకి మరదలుగా కనిపించబోతోంది ఈ ఉత్తరాది సోయగం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున కథానాయకుడిగా `ది ఘోస్ట్` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె తప్పుకోవడంతో అమలా పాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడదే రోల్ లో మెహ్రీన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదే గనుక నిజమైతే.. మెహ్రీన్ కిది బంపర్ ఆఫరే.
Also read: మెగాస్టార్ సవతి చెల్లెలి పాత్రకు నయనతారకు కళ్లు తిరిగే రెమ్యూనరేషన్!
మరి.. వెంకీకి మరదలుగా అలరించిన మెహ్రీన్.. నాగ్ కి జోడీగానూ ఆకట్టుకుంటుందేమో చూడాలి. కాగా, 2022 ప్రథమార్ధంలో `ది ఘోస్ట్` చిత్రం థియేటర్స్ లోకి రానుంది. అంతకంటే ముందే.. `ఎఫ్ 3` చిత్రంతో సందడి చేయనుంది మెహ్రీన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



