'మెగా 154'లో చిరంజీవి తమ్ముడిగా రవితేజ!
on Nov 11, 2021

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ ని చూస్తేనే ఇది పక్కా మాస్ సినిమా అని అర్థమైంది. ఈ ఒక్క పోస్టర్ తోనే మాస్ కి పూనకాలు వచ్చేలా చేశాడు బాబీ. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
'మెగా 154'లో చిరంజీవి తమ్ముడి పాత్ర ఉంటుందని, సినిమాకి చాలా కీలకమైన ఈ పాత్రని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని బాబీ డెవలప్ చేశారని ఇటీవల న్యూస్ వినిపించింది. అంతేకాదు ఈ పాత్రలో పవన్ ని నటింపజేయాలని బాబీ ప్లాన్ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాత్ర కోసం రవితేజ పేరు తెరమీదకు వచ్చింది.
2000లో వచ్చిన 'అన్నయ్య' సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు 'మెగా 154'లో చిరంజీవి తమ్ముడిగా ఆయన నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి-కొరటాల కాంబోలో వస్తున్న 'ఆచార్య' సినిమాలో సిద్ధ అనే కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పుడు 'మెగా 154' కోసం రవితేజ రంగంలోకి దిగబోతున్నాడన్న న్యూస్ ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



