అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్!
on Nov 13, 2021

పాలిటిక్స్ కోసం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ చేస్తున్న పవన్.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.
'పటాస్' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. అనంతరం సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు మీకెవ్వరు సినిమాలతో వరుస విజయాలు అందుకున్న అనిల్.. ప్రస్తుతం F3 సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో పవన్ తో సినిమా చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కోసం అనిల్ ఒక పవర్ ఫుల్ స్టొరీని కూడా రెడీ చేశారని తెలుస్తోంది.
అయితే స్టొరీ విషయంలో అనిల్ కి పవన్ కొన్ని కండిషన్స్ పెట్టారట. కేవలం ఒక సెక్షన్ ఆడియెన్స్ కే రీచ్ అయ్యేలా హీరో ఎలివేషన్స్ ఉన్న మాస్ స్టొరీ వద్దు.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా రీచ్ అయ్యేలా మంచి ఫన్ తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో ఉన్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



