బుల్లి తెర ఎంట్రీ కి చిరుని మించి తీసుకుంటున్న ఎన్టీఆర్
on May 29, 2017
.jpg)
త్వరలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లి తెరలో యాంకర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోని, తెలుగులో ఎన్టీఆర్ తో చేసేందుకు స్టార్ మా టీవీ ఛానల్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం కి భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడని తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చిరంజీవికి మీలో ఎవరు కోటీశ్వరుడు కి ఇచ్చిన పారితోషికం కన్నా కూడా ఎన్టీఆర్ కి ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని సమాచారం. ఇప్పటికే హిందీలో పది ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ని తమిళ్లో కమల్ హాసన్ హోస్ట్ చేయనున్నారు. తెలుగులో మాసీవ్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ హీరో చేయడం పెద్ద ప్లస్ పాయింట్. దానికి తోడు, ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు టీవీ రియాలిటీ షోలు దాదాపు నిన్నటి తరం సీనియర్ నటీ, నటులే చేసారు. కానీ, మొదటిసారిగా ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరో ఒక షోకి యాంకర్ గా వ్యవహరించేందుకు ఒప్పుకోవడం గమనార్హం. అసలు ఇంతకీ బిగ్ బాస్ కి మాతృక ఏంటో తెలుసా హాలీవుడ్ పాపులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బ్రదర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



