ఆ సినిమాని జగన్ భుజాన మోస్తున్నాడా..?
on May 27, 2017

ఎక్కడైనా సరే..ఎప్పుడైనా సరే నెగ్గుకు రావాలంటే అంగబలం, అర్థబలం ఉండాలంటారు..అవి లేకపోయినా కనీసం అవి రెండూ ఉన్న వారి సపోర్ట్ ఉంటే చాలు..మనల్ని ఆపేవారు ఉండరు. ఇది ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిన్న విడుదలైంది. కింగ్ నాగార్జునకు సొగ్గాడే చిన్నినాయన లాంటి హిట్‌తో తొలిసారి 50 కోట్ల క్లబ్‌లో చేర్చిన దర్శకుడు కావడం..టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
మార్నింగ్ షో అయిన వెంటనే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో నెగిటివ్ రివ్యూలు వస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ తన పలుకుబడిని వాడాడు. తన అన్న వైసీపీ నేత కురసాల కన్నబాబును రంగంలోకి దించి తెలుగు మీడియాలో టాప్ వెబ్‌సైట్స్ నెగిటివ్ రివ్యూలు రాయకుండా ఒత్తిడి చేశారట. అందుకే సదరు వెబ్‌సైట్స్‌లో సినిమాకు అనుకూలంగా వార్తలు వచ్చాయంటూ ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. అయితే సినిమాలో విషయం లేకపోయినా వెబ్‌సైట్స్‌లో అనుకూల వార్తలు రాయిస్తే ఇది ఎంతవరకు ఉపయోగపడుతోందో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



