హృతిక్ రోషన్‌తో 'శ్యామ్ సింగ రాయ్' హిందీ రీమేక్? నాని ఏం చెప్పాడంటే...
on Nov 9, 2021

టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడిగా నాని పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్‌నే నమ్ముకొని ఎదిగిన నాని ఎంచుకుంటున్న సబ్జెక్టులు విమర్శకుల్నీ, ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'శ్యామ్ సింగ రాయ్' క్రిస్మస్‌కు విడుదలవుతోంది. పునర్జన్మ నేపథ్యంలో నడిచే పీరియాడికల్ సబ్జెక్టుతో ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇటీవల మొదలయ్యాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ 'ద రైజ్ ఆఫ్ శ్యామ్'కు సంగీత ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఫ్యాన్స్‌తో మాట్లాడిన ఓ ప్రోగ్రామ్‌లో 'శ్యామ్ సింగ రాయ్'ను హిందీలో రీమేక్ చేస్తారా? అనే ప్రశ్న ఎదుర్కొన్నాడు నాని.
భాషతో నిమిత్తం లేకుండా మంచి స్క్రిప్టు ఎక్కడైనా వర్కవుట్ అవుతుందని నాని చెప్పాడు. మంచి కంటెంట్‌కు యూనివర్సల్ వాల్యూ ఉంటుందని ఆయన అన్నాడు. "స్క్రిప్ట్ అనేదే ఒక సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టును చేస్తుంది. అన్ని భాషల్లో మెప్పించేలా ఒక మూవీ బాగుంటే, సబ్‌టైటిల్స్‌తో కూడా జనం దాన్ని ఎంజాయ్ చేస్తారు. యస్, అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకర్షించే గుణం 'శ్యామ్ సింగ రాయ్'లో ఉంది" అని చెప్పాడు నాని. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి. తెలుగు వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తే హృతిక్ రోషన్ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపే అవకాశం ఉందని అతనన్నాడు.
"మేం 'శ్యామ్ సింగ రాయ్'ను హిందీ రిలీజ్ కోసం ప్లాన్ చేయట్లేదు. కానీ నేను దాని విడుదల కోసం ఎదురుచూస్తున్నా. ఎవరికి తెలుసు, హృతిక్ రోషన్ కూడా ఈ మూవీని హిందీలో రీమేక్ చేయొచ్చు" అన్నాడు నాని. యథాలాపంగా ఆ మాటను చెప్పాడా, లేక నిజంగానే 'శ్యామ్ సింగ రాయ్' స్ర్కిప్టు హృతిక్ రోషన్ దగ్గరకు వెళ్లిందా? అనే విషయం తెలీదు.
కోల్‌కతా నేపథ్యంలో కథ నడిచే 'శ్యామ్ సింగ రాయ్'లో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



