ఓ రేంజ్‌లో అమ్ముడుపోయిన 'భీమ్లా నాయక్' ఓటీటీ రైట్స్!
on Feb 19, 2022

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటరల్లో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. హిందీలోనూ ఏక కాలంలో రిలీజవుతోన్న ఈ సినిమాలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన భీమ్లా నాయక్‌తో గొడవపడే మాజీ హవల్దార్ డానియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి కనిపించనున్నారు. పవన్ భార్యగా నీత్యా మీనన్, రానా భార్యగా సంయుక్త మీనన్ నటించారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రెండు రోజుల క్రితమే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఇవాళ 'భీమ్లా నాయక్'పై వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. తమన్ స్వరాలు కూర్చిన పాటలు సూపర్ పాపులర్ కావడంతో సినిమాపై క్రేజ్ విపరీతమైంది. భీమ్లా నాయక్ క్యారెక్టర్ టీజర్‌తో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. దానికి తగ్గట్లే థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 'భీమ్లా నాయక్' ఓటీటీ హక్కులు కూడా అనూహ్య స్థాయిలో అమ్ముడయ్యాయి. థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాల తర్వాత దేశంలోని నంబర్ వన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు తెలుగు కంటెంట్ మాత్రమే అందించే ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి 'భీమ్లా నాయక్' రైట్స్ రూ. 60 కోట్లకు అమ్ముడయ్యాయని వినిపిస్తోంది. అంటే పవన్ కల్యాణ్‌కు చెల్లించిన రెమ్యూనరేషన్.. ఈ హక్కులతో నిర్మాతలకు వచ్చేసినట్లే అన్నమాట.
త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన ఈ మూవీలో రావు రమేశ్, మురళీశర్మ, సముద్రకని, రఘుబాబు, నర్రా శ్రీను, కాందబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి ఇతర కీలక పాత్రధారులు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా, నవీన్ నూలి ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



