మహేశ్ - రాజమౌళి చిత్రంలో బాలయ్య!?
on Feb 19, 2022

దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`.. వేసవి కానుకగా మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టిస్టారర్.. పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది.
ఇదిలా ఉంటే, జక్కన్న నెక్స్ట్ వెంచర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. అంతేకాదు.. ఇందులో 40 నిమిషాల పాటు సాగే ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. అందులో ఓ సీనియర్ స్టార్ నటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఆ స్పెషల్ రోల్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ కనిపిస్తారట. కాకపోతే మహేశ్ కాంబినేషన్ లో బాలయ్యకి ఎలాంటి సీన్స్ ఉండవని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, మహేశ్ - రాజమౌళి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. స్వరవాణి కీరవాణి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంగీతమందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



