అఖిల్‌కు ప్రపోజ్ చేసిన అబ్బాయి..!
on Jul 17, 2017

వైట్ స్కిన్ టోన్‌తో..చాక్లెట్ బాయ్‌లా ఉండే అఖిల్‌ను చూస్తే పడిపోని అమ్మాయి ఉంటుందా..? అందుకు తగ్గట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను..నువ్వంటే నాకు ఇష్టం లాంటి మెసేజ్‌లతో అఖిల్ సోషల్ మీడియా పేజీల్లో రోజూ వేలాది పోస్ట్‌లు కనిపిస్తాయి..అలాంటిది అబ్బాయి అఖిల్‌కు ప్రపోజ్ చేస్తే..? ఇది ఆబద్దం కాదు..నిజం. అసలు విషయం ఏంటంటే భల్లాలదేవుడు రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నెంబర్ యారి షోకి అక్కినేని అఖిల్, రాజమౌళి తనయుడు కార్తికేయ గెస్ట్‌లు వచ్చారు. ఈ సందర్భంగా నీకు ఒకబ్బాయి ప్రపోజ్ చేశాడటగా అని అడగ్గా..అందుకు అవునని తల ఊపాడు అఖిల్. ఒకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా జరిగిన ఇన్స్‌డెంట్ చెప్పాడు. తాను ఒకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కనెక్టింగ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగాను..తిరిగి ఫ్లైట్ ఎక్కబోతుండగా నా సీటువైపు చూడగా..దాని మీద ఐ లవ్ యూ అనే స్టిక్కర్ అంటించి ఉండటం చూశాను..దీని గురించి ఎయిర్‌హోస్టెస్‌ను అడిగితే మీ పక్కన కూర్చొన్న వ్యక్తి దీనిని అంటించడం నేను చూశాను అని చెప్పడంతో ఆ క్షణం.. అలాంటి వ్యక్తి నా పక్కన కూర్చొన్నాడు అని తలచుకుంటేనే నాకు ఒళ్లంతా కంపరంగా ఉంది అని చెప్పాడు అఖిల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



