త్రిష ఆ పాత్రలో రక్తి కట్టిస్తుందా?
on Jun 19, 2015
.jpg)
పోలీస్ కథలకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గిరాకే వుంటుంది. దీంతో చాలా మంది కథానాయికలు కూడా అప్పుడప్పుడూ ఖాకీ కట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. వీరి జాబితాలో ముదుండేది విజయశాంతి. ఆమె తరువాత చాలా మంది ముద్దుగుమ్మలు లాఠీ పట్టి తమ తఢాకా చూపించారు. అయితే గత కొంతకాలంగా ఇలాంటి పాత్రలకు హీరాయిన్లు దూరంగా వుంటున్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు త్రిష ఇలాంటి పాత్ర చేయబోతోందట. ఓ తమిళ చిత్రంలో త్రిష పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందని టాక్. అయితే త్రిష మరీ స్లిమ్‌గా... లేలేత తమలపాకులా కనిపిస్తుంది. అలాంటి నాజూకు భామకు ఈ టైపు పాత్రలు సూటవుతాయా అన్నదే డౌటు. మరి పోలీస్ పాత్రలో త్రిష ఏ మేరకు రక్తి కట్టిస్తుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



