'బహుబలి'తో శ్రీనువైట్ల!!
on Jun 19, 2015

గత రెండు సంవత్సరాలుగా 'బహుబలి' కోసం కష్టపడ్డ ప్రభాస్, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ లలో బిజిబిజీగా గడుపుతున్నాడు. బాహుబలి జూలై 10 విడుదలకు సిద్దమవుతుండగా, దీని తరువాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి ఆయన అభిమానులలో నెలకొంది. గతంలో తన తరువాతి సినిమా రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజిత్ తో వుంటుందని ప్రభాస్ చెప్పాడు, కానీ ఆ చిత్రం ఇంకా స్టొరీ డెవలప్ దశలోనే వుందని, సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
లేటెస్ట్ గా మరో న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ప్రభాస్ ని ఓ పార్టీలో కలిసిన శ్రీనువైట్ల ఆయన ఓ స్టొరీ లైన్ వినిపించారట. ఇది డార్లింగ్ కి తెగ నచ్చేయడంతో డెవలప్ చేయమని చెప్పాడట. దీంతో శ్రీనువైట్ల రామ్ చరణ్ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ తో సినిమా చేయాలనే పట్టుదలతో వున్నాడట. ఈ లేటెస్ట్ అప్ డేట్ మాత్రం రెబెల్ స్టార్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



