సినిమాలకు హేమ ఆంటీ స్వస్తి ?
on Apr 17, 2014

దాదాపు చాలా చిత్రాల్లో బ్రహ్మానందంతో కలిసి నటించిన నటి హేమ అందరికి సుపరిచితురాలే. ఎప్పుడూ కూడా ఎదో ఒక గోల చేస్తూనే ఉండే ఈ అమ్మడు త్వరలోనే సినిమాలకు స్వస్తి పలకడానికి సిద్ధమవుతుంది. ఈ అమ్మడు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుంది. జై సమైఖ్యాంధ్ర పార్టీ అభ్యర్థినిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఈ విషయం గురించి హేమ మాట్లాడుతూ... మండపేట అసెంబ్లీ జేఎస్పీ అభ్యర్థినిగా తాను ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయబోతున్నానని, సమైక్యాంధ్ర పరిరక్షణ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే స్థిర సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపిస్తే మండపేటలోనే ఉండి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను" అని అన్నారు.
మరి ఒకవేళ ఈ అమ్మడు ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు స్వస్తి చెప్తుందా? లేదంటే ప్రజలకు చెప్పిన మాటలను గాలికి వదిలేసి తన స్వలాభం కోసం సినిమాల్లో నటిస్తుందో త్వరలోనే తెలియనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



