అయ్యోపాపం 'ఐ' చిత్రాన్ని కొనేవాళ్ళు లేరు..!
on Aug 26, 2014
.jpg)
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 185 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం ‘ఐ’ (తెలుగులో మనోహరుడు). విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగులో కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీ టాక్. తెలుగు శంకర్ సినిమాలకు వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత అస్కార్ రవిచంద్రన్ తెలుగు రైట్స్ కి ఇరవై కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. కానీ విక్రమ్ కి తెలుగులో అంతగా మార్కెట్ లేకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు అంత మొత్తానికి ధైర్యం చేయలేకపోతున్నారు. శంకర్ కు వున్న డిమాండ్ కి కొంతమంది 15కోట్లకు ముందుకు వచ్చినట్లు సమాచారం. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నిర్మాతకి అంతగా గిట్టుబాటు కావడంలేదని అనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ఆడియో రిలీజ్ తరువాత తెలుగులో మరింత హైప్ తీసుకువచ్చి ఆతరువాత సినిమా రైట్స్ అమ్మాలనే ఆలోచనలో అస్కార్ రవిచంద్రన్ వున్నారట. మరి ఆయన ప్రయత్నాలు తెలుగులో ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



