సమంత ఏం మందు పెట్టిందో??
on Dec 12, 2015
.jpg)
త్రివిక్రమ్ పవన్ కల్యాణ్‌తో రెండు సినిమాలు, మహేష్ బాబుతో రెండు సినిమాలు చేశాడు. హీరోల్ని రిపీట్ చేశాడు గానీ, ఎప్పుడు హీరోయిన్లను మాత్రం రిపీట్ చేయలేదు. సమంత విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్‌ని పక్కన పెట్టాడు. అత్తారింటికి దారేది సినిమాలో తొలిసారి తన సినిమాలో సమంతని కథానాయికగా తీసుకొన్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి కోసం రిపీట్ చేశాడు.
ఇప్పుడు నితిన్‌తో చేస్తున్న అఆలోనూ సమంతనే కథానాయిక. ఓ దర్శకుడు కథానాయికకి వరుసగా మూడు అవకాశాలు ఇవ్వడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇదే అదునుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం ఊపందుకొంది. అయినా త్రివిక్రమ్ వెనక్కి తగ్గడం లేదు. సూర్యతో చేయబోయే సినిమాలోనూ సమంతనే కథానాయికగా ఎంచుకొన్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది.
అంటే త్రివిక్రమ్ ఓకథానాయికతో పనిచేయడం వరుసగా నాలుగోసారన్నమాట. సమంత ఏం మందు పెట్టిందో, త్రివిక్రమ్ ఆమెను వదల్లేకపోతున్నాడు. ఇక గాసిప్పు రాయుళ్లకు బోల్డంత కాలక్షేపం. వీరిద్దరి మధ్య మరిన్ని వేడి వేడి వార్తలు పుట్టించొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



