ముద్దంటే మహేష్‌కి అంత మొహమాటమా?
on Dec 12, 2015
.jpg)
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేష్ బాబు పేరే చెబుతారంతా. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినా.. ఇప్పటికీ మహేష్ అంటే అమ్మాయిలు పడిచస్తారు. మహేష్ ఫ్యాన్స్‌లో అమ్మాయిల వాటా కూడా ఎక్కువగానేఉంటుంది. మహేష్‌ని రొమాంటిక్ హీరోగా చూడాలని వాళ్లందరి ఆశ. ఇది వరకు మహేష్ రొమాంటిక్‌సీన్స్‌లో బాగానే నటించేవాడు.
అతడులో త్రిషతో బిజినెస్ మేన్‌లో కాజల్ తో, దూకుడులో సమంతతో రొమాన్స్ బాగానే పండించాడు. అందులో చిన్న చిన్న లిప్‌లాక్‌లూ ఉన్నాయి. అయితే ఈమధ్య మహేష్ బాబు మైండ్ సెట్ పూర్తిగా మారింది. అలాంటి సీన్లు తన సినిమాలో లేకుండా చూసుకొంటున్నాడు. అయితే బ్రహ్మోత్సవంలో మాత్రం ఒకేసారి ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేసే సన్నివేశం ఉందట. కాజల్, సమంత, ప్రణీతలతో మహేష్.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనున్నాడట.
ఓ కథానాయికతో లిప్ లాక్ కూడా చేయాల్సివస్తోందని టాక్. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మాత్రం ఈ విషయంలో నో చెప్పాడట. ఇలాంటి సీన్లు రాయొద్దు.. మన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అసలే వద్దు అంటున్నాడట. తనసినిమా అంటే తన ఫ్యామిలీ మొత్తం కలసి చూడాలని, తన వారసులు గౌతమ్, సితార కూడా తన సినిమా చూస్తారని, వాళ్ల కు అలాంటి సన్నివేశాల్ని చూపించలేనని చెబుతున్నాడట. అంటే మహేష్ ఓ హీరోలా కాకుండా, ఓ తండ్రిగా ఆలోచిస్తున్నాడన్నమాట. మంచిదేగా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



