సమంత డిస్కౌంట్ ఇస్తోంది..!!
on Nov 12, 2014
కోలీవుడ్ లో ఐరన్ లెగ్ గా పేరుపొందిన సమంత, రీసెంట్ గా వచ్చిన మురగదాస్ 'కత్తి' తో హిట్ కొట్టి ఆ మరకను చేరిపేసుకుంది. ఈ హిట్ కోసం సమంత చాలా కాలం వేచిచూడాల్సి వచ్చింది. ఇక ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసింది ఈ చెన్నయ్ భామ. తెలుగులో ఎలాగో టాప్ పొజిషన్ లో వుంది కాబట్టి కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలగాలని కలలు కంటుందట. దీని కోసం తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ కి దగ్గర కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందట. మంచి కథలతో వస్తే రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ కూడా ఇస్తానని నిర్మాతలకు ఆఫర్లు పంపిస్తుందట. సమంతకి తెలుగులో కూడా మంచి మార్కెట్ వుండడంతో నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చుపుతున్నారట. మరి సమంత కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదుగుతుందో..? లేదో..? భవిష్యతే నిర్ణయించాలి.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



