కృష్ణుడికి భార్యే దిక్కు..!
on Nov 12, 2014
.jpg)
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందిన కృష్ణవంశీ, గత కొన్ని సంత్సరాలుగా హిట్ కోసం పరితపిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడు'తో హిట్ కొడతానని భావించిన వంశీకి నిరాశే ఎదురయ్యింది. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చిన ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. దీంతో తన భార్య రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్ చేసే ఆలోచనలో వున్నాడట కృష్ణవంశీ. రమ్యకృష్ణకి అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో మంచి మార్కెట్ వుండడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రమ్యతో సినిమా చేయడంవల్ల మరో హీరో వెనుక పడాల్సిన అవసరం రాదని భావిస్తున్నారట. ఆఖరికి హిట్ కోసం పరితపిస్తున్న కృష్ణవంశీకి భార్యనే దిక్కైంది..!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



