గుణ మీద మెగా ఫ్యామిలీ గుస్సా
on Oct 15, 2015
.jpg)
‘రుద్రమదేవి’ డైరెక్టర్ గుణశేఖర్‌కి తమ మెగాఫ్యామిలీ ఎంత హెల్ప్ చేసినా గుణశేఖర్‌కి ఎంతమాత్రం కృతజ్ఞత లేదని మెగా ఫ్యామిలీ గుస్సా అవుతున్నట్టు సమాచారం. కష్టాల్లో పడిపోయి, దాదాపు ఆగిపోయే స్థితికి వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా మళ్ళీ పట్టాలు ఎక్కడానికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అల్లు అర్జున్. అల్లువారి అబ్బాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటించాడు. అల్లు అర్జున్ సహకారం వల్లే సినిమా పూర్తయిందని గుణశేఖర్ కూడా చెప్పాడు.
‘రుద్రమదేవి’ విడుదలయ్యాక థియేటర్‌కి జనాలను తీసుకొస్తున్న అంశాల్లో ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా ఒకడు. అయితే గుణశేఖర్ ఒక మెగా హీరో చేసిన ఉపకారాన్ని మరచిపోయి, మరో మెగాహీరో రామ్ చరణ్ సినిమాని టార్గెట్ చేయడం మెగా ఫ్యామిలీకి కోపం తెప్పించింది. ఈనెల 16న రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలైతే రుద్రమదేవి కలెక్షన్లు పడిపోతాయని గుణశేఖర్ భయపడుతున్నాడు. ఈ సినిమా విడుదలను వాయిదా వేయించడం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందులో భాగంగా దాసరి చేత ప్రెస్ మీట్ పెట్టించి పెద్ద సినిమాలు వెంటవెంటనే విడుదల కావడం మంచిది కాదు అనే మాట చెప్పించాడు. ఇది మెగా ఫ్యామిలీకి మరింత కోపాన్ని తెప్పించింది. తమ ఫ్యామిలీ మీద ఎప్పుడూ మాటల దాడి చేసే దాసరిని తమ మీద ప్రయోగించడం పట్ల మెగా ఫ్యామిలీ బాగా హర్టయినట్టు తెలుస్తోంది. దాసరి వల్ల గుణశేఖర్‌కి ఒరిగేదేమీ లేకపోయినా గుణశేఖర్ మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



