ఒంటెను కాదయ్యా.. ఊరిని దత్తత తీసుకో!!
on Oct 15, 2015
.jpg)
ఊరిని దత్తత తీసుకోవాలన్న స్ఫూర్తి నిచ్చిన చిత్రం... శ్రీమంతుడు. నీతులు చెప్పడానికే కాదు, ఆచరించడానికి కూడా అన్నట్టు మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకొని - హీరోలందరికీ ఆదర్శంగా నిలిచాడు. మహేష్ చూపించిన బాటలోనే ప్రకాష్‌రాజ్ కూడా నడిచి.. ఓ గ్రామ బాధ్యతను భుజాలపై వేసుకొన్నాడు. వీరిద్దరి దారిలో పరిశ్రమలోని కొంతమంది హీరోలైనా నడవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రామ్‌చరణ్ కూడా దత్తత తీసుకొన్నాడు.
అయితే ఊరిని కాదు, ఒంటెను. అమల చరణ్, ఉపాసన దంపతులకు ఓ ఒంటెను బహుమతిగా ఇచ్చిందట. ఇప్పుడు ఆ ఒంటె.. ఆలనా పాలనను చరణ్ తీసుకొంటున్నాడు. మూగ జీవాలను ఆరాధించడం వరకూ బాగానే ఉంది. కానీ.. చరణ్‌కి ఉన్న స్థోమత అంతకంటే ఎక్కువ కదా..?? ఒంటెని కాదు, ఊరిని దత్తత తీసుకోదగిన కెపాసిటీ చరణ్‌కి ఉంది.
మరి మహేష్ బాటలో నడిస్తూ.. ఓ ఊరిని ఎప్పుడు దత్తత తీసుకొంటాడు?? ఈ విషయం అడిగితే మాత్రం చరణ్ నీళ్లు నములుతున్నాడు. డాడీ అల్రెడీ ఓ ఊరిని దత్తత తీసుకొన్నారు కదా అంటున్నాడు. అది.. ఎంపీ గా చిరు బాధ్యత. మరి ఓ కథానాయకుడిగా చరణ్ ఆ మాత్రం చేయలేడా?? చరణ్ మాత్రం `ఇంకా ఊరి దత్తత కోసం ఏమీ ఆలోచించలేదు` అంటున్నాడు. హీరోయిజం తెరపైనేనా, బయట ఏమీ లేదా? అంటే చరణ్ ఏం సమాధానం చెబుతాడో ఏంటో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



