నయనతార అతనితో రొమాన్స్ చేస్తుందా?
on Nov 5, 2014
.jpg)
నయనతార ఓ స్టార్ నాయిక. ఆమెతో కలసి నటించాలని అగ్ర కథానాయకులు సైతం తహతహలాడతారు. ఆమె కాల్షీట్లు ఇస్తే చాలు, సినిమాకి క్రేజ్ తీసుకురావొచ్చు... అని నిర్మాతలు ఆశపడుతుంటారు. అలాంటి నయన ఇప్పుడో కమెడియన్‌తో ఆడిపాడబోతోంది. రొమాన్స్ చేయబోతోంది. సంగతేంటంటే... కార్తీ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతారని కథానాయికగా ఎంచుకొన్నారు. ఇందులో వడివేలుకీ కథానాయికకీ ఓ కామెడీ ట్రాక్ ఉంది. కథానాయికని చూసి వడివేలు మనసు పారేసుకోవడం, కలలో డ్యూయెట్లు పాడుకోవడం, ఈ తతంగం అంతా ఉంటుంది. వడివేలు, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కావల్సినంత వినోదం పంచిపెడతాయట. ఈ చిత్రంలో కథానాయికగా ముందు శ్రుతిహాసన్‌ని ఎంచుకొన్నారు. ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమాని వదులుకొంది. ఇప్పుడు ఆ స్థానంలోకి నయన వచ్చి చేరింది. మరి నయన - వడివేలు మధ్య రొమాన్స్ ఏ రీతిన సాగిందో తెలియాలంటే ఈ సినిమా రావాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



