ENGLISH | TELUGU  
Home  » Gossips

హ్యాట్రిక్ ప్లాఫ్స్‌‌తో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన..!

on Aug 12, 2014

Mahesh fans Fear about Tamanna, Tamanna Becomes Iron Leg, Tollywood Milky Beauty Tamanna, Tollywood Top Heroine

బాలీవుడ్‌‌లో తమన్నా నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో.. ఇప్పుడు అందరూ ఐరన్ లెగ్ అంటున్నారు. ఇందుకు కారణం తమన్నా నటించిన 'ఎంటర్టైన్మెంట్' సినిమా ఇటీవలే విడుదలై బాలీవుడ్ విమర్శకులకు తావిచ్చింది. ఈ సినిమాని బాలీవుడ్ విమర్శకులు చీల్చి చెండాడుతున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకుంటుందే తప్ప గట్టిగా వారం రోజులు కూడా ఆడే పరిస్దితి లేదంటున్నారు. అంతకముందు తమన్నా చేసిన రెండు బాలీవుడ్ చిత్రాలు ఇదే రేంజ్ లో ఫ్లాప్ లను మూటగట్టుకున్నాయి.

దీంతో ఇప్పుడు మహేష్ అభిమానులకు భయం పట్టుకుంది. బాలీవుడ్‌లో హ్యాట్రిక్ ఫ్లాప్స్‌ని నమోదు చేసిన హీరోయిన్ ప్రభావం తమ సూపర్ స్టార్ సినిమాపై ఏవిధంగా పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తెలుగులో కూడా తమన్నా ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. హ్యాపీ డేస్, 100%లవ్, రచ్చ సినిమాలు తప్ప మిగతావి పెద్దగా ఆడిన దాఖలా లేదు. పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ తమన్నాకి లక్ కలిసి రాలేదు.

తెలుగులో తమన్నాకి సక్సెస్ రేట్ లేకున్నా డిమాండ్ మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'ఆగడు' సినిమాలో నటిస్తోంది. మహేష్ బాబుతో దూకుడు లాంటి బ్లాక్ బాస్టర్ తీసిన శ్రీనువైట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మహేష్ పుట్టిన రోజున విడుదలై సోషల్ మీడియాలో ఒక వైరల్‌లా వెళుతుంది. మహేష్ పంచ్ డైలాగ్‌లు అభిమానులకు సైతం బాగా నచ్చాయి. ఐతే తమన్నా ఐరన్ లెగ్ దెబ్బకు మహేష్ 'ఆగడు' వెనక్కు తగ్గుతుందా లేక బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.