ఎన్టీఆర్‌పై మరో కుట్ర మొదలైందా??
on Feb 1, 2016

పాపం ఎన్టీఆర్. పద్మవ్యూహంలో చిక్కుకొన్న అభిమన్యుడిలా మారిపోయాడు. అతని చుట్టూ ఉన్నవాళ్లంతా కత్తులు ఎత్తిపెట్టినవాళ్లే. వాళ్లతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు తారక్. మొన్నటికి మొన్న.. నాన్నకు ప్రేమతో సినిమాని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో? థియేటర్లు ఇచ్చినవాళ్లమీద ఓ వర్గం దౌర్జన్యానికి దిగింది. ఈ సినిమా కొంటే.. మీ అంతు చూస్తాం.. అని పరోక్షంగా కొంతమంది బెదిరించారు కూడా. అంతెందుకు.. కొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతోందనగా.. ఓ టాప్ హీరో.. అడ్డుకొనే ప్రయత్నం చేయడం ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఈ పద్మవ్యూహం నుంచి ఏదోలా బయటపడి.. తన సినిమాని రిలీజ్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్‌పై మరో కుట్ర మొదలైంది.
ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ పార్టీ మారుతున్నాడంటూ.. వైకాపా తీర్థం పుచ్చుకొంటున్నాడంటూ ఓ వర్గం రుమర్లు పుట్టించింది. అంటే.. పరోక్షంగా ఎన్టీఆర్ కూడా వైకాపా గూటికి చేరుతున్నట్టే కదా?? దాంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం షాకయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలు, అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. చివరికి... అదేం లేదన్న విషయం రూఢీ అయ్యింది. 2014 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి గాసిప్పులే పుట్టాయి. వాటన్నింటికీ ఎన్టీఆర్ ఆనాడే సమాధానం చెప్పాడు. తన చివరి రక్తపు బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశాడు. అయినా సరే.. ఇలాంటి గాసిప్పులు పుడుతూనే ఉన్నాయి. అర్థం పర్థం లేని ప్రచారంతో ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని.. అలాంటి వాళ్లెవరో కనిపెట్టి వాళ్లకు బుద్ది చెబుతామని ఎన్టీఆర్ కాంపౌండ్ వాళ్లు అంటున్నారు. మొత్తానికి పొలిటిక్ కుట్ర నుంచి ఎన్టీఆర్ త్వరగానే బయటపడ్డాడు. మున్ముందు ఇంకెన్ని చూడాల్సివస్తుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



