గుడిలో..బడిలో..పాటపై హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!
on Jun 11, 2017

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమానుల కోసం రిలీజ్ చేసిన "గుడిలో బడిలో" సాంగ్ బ్రాహ్మాణులతో పాటు శివుణ్ణి కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై వారు అభ్యంతరం తెలిపారు. ఆ సాహిత్యాన్ని పాటలోంచి తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. దీనిపై హరీశ్ శంకర్ వివరణ ఇవ్వడం..అదే రోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆడియో రిలీజ్ సందర్భంగా దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఏ సినిమాకైనా మూలస్థంభం దర్శకుడేనని..నేను రాయమంటేనే రచయితలు పాటలు రాశారని కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే అన్నారు. ఎవరైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి..పొగిడితే రచయితలను పొగడండి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో హరీశ్ ఏం మాట్లాడతాడా అని ఎదురుచూసిన వాళ్లకి అదిరిపోయే సమాధానం ఇచ్చినట్లైంది..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



