ఆది కేరియర్ మలుపు తిరుగుతుందా?
on Nov 13, 2014
ఆది పినిశెట్టి హీరోగా, సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో ఆదర్శ్ చిత్రాలయ ప్రై.లిమిటెడ్ పతాకంపై రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న చిత్రం 'మలుపు'. యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ ని బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సి.కళ్యాణ్, సాగర్, గుణ్ణం గంగరాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. టీజర్, ఫస్ట్ లుక్ లాంఛ్ అనంతరం...
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''ఈ సినిమా రవిరాజా పినిశెట్టి కుటుంబానికి మంచి మలుపు అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది'' అన్నారు.
డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ - ''రవిరాజాగారి ఇద్దరి పిల్లలు మంచి క్రమశిక్షణ కలవారు. ఆది హీరోగా నిరూపించుకుంటున్నాడు. సత్య ప్రభాస్ కి ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెడుతుంది'' అని చెప్పారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ''రవిరాజా పినిశెట్టిగారు చాలా డెడికేటెడ్ పర్సన్. ఆయనలానే సత్య, ఆది కూడా డెడికేటెడ్ గా సినిమాలు చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''అన్నయ్య దర్శకత్వంలో చేసిన ఈ సినిమా నాకు చాలా స్పెషల్. సత్య తొలి సినిమాని చాలా కాన్ఫిడెంట్ గా చేసాడు. నాకు, తనకు ఇద్దరికీ మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రం ఇది. యాక్షన్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది'' అన్నారు.
సత్యప్రభాస్ మాట్లాడుతూ - ''రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఆది చాలా చక్కగా ఈ చిత్రంలో నటించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చతుందనే కాన్ఫిడెంట్ ఉంది'' అని తెలిపారు.
రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ - ''ఆది, సత్య ఓ తపస్సులా భావించి ఈ సినిమా చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ఆది, సత్యకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది'' అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



